Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

భోజనంపైనా విమర్శలా?


బీజేపీపై తృణమూల్‌ ఎంపీ మొయిత్రా మండిపాటు


న్యూదిల్లీ: పార్లమెంటు కాంప్లెక్స్‌లో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీలు చికెన్‌ తిన్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం మండిపడ్డారు. 24మంది ఎంపీలను రాజ్యసభ, లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేయడానికి నిరసనగా భారీ ప్రదర్శన జరిగింది. చికెన్‌ తంటూ ధర్నాలు చేయడం ఏమిటంటూ బీజేపీ అధికార ప్రతినిధి షేజాద్‌ పూనావాలా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై మొయిత్రా విరుచుకుపడ్డారు. 18 ఏళ్ల అమ్మాయి(ఇరానీ కుమార్తె) గోవాలో అక్రమ బార్‌ నడిపుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు ఏమి తింటున్నారో కూడా రాజకీయం చేయాలా అని ట్విట్టర్‌ వేదికగా మొయిత్రా ప్రశ్నించారు. ఇరానీ కుమార్తెకు తగిలి వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేశారు. అహింసావాది గాంధీ విగ్రహం వద్ద కోడిమాంసంతో భోజనం చేయడం ఆయనను అవమానించడమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి నిన్న వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోతూ కాంగ్రెస్‌ అలవాటుగా చెబుతూ దేశంలోని గొప్ప గొప్ప నాయకులను అవమానిస్తున్నారని మహువా మొయిత్రా విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img