Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

స్వేచ్ఛను కాపాడుకోవాలి

. క్విట్‌ ఇండియా వార్షికోత్సవ సందేశంలో ప్రజలకు సోనియా ఉద్బోధ
. క్రూరమైన అణచివేత మధ్య బ్రిటీషు వారికి ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు

న్యూదిల్లీ: క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం దేశ స్వాతంత్య్రాన్ని ‘మన శక్తితో’ రక్షించాలని ప్రజలకు ఉద్బోధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సమయంలో బ్రిటిష్‌ వారికి మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్త లను కొట్టి జైల్లో పెట్టిన ఈ చారిత్రాత్మక రోజున అరుణా ఆసిఫ్‌ అలీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆమె ధైర్యసాహసాలు మన స్వాతంత్య్ర తపనకు ప్రతీక అని సోనియా గాంధీ తన సందేశంలో అన్నారు. ‘మహాత్మా గాంధీ నేతృత్వం లోని క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని మనం స్మరించుకుంటున్నప్పుడు, భారతదేశ స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది మన దేశస్తులు, మహిళలు చెల్లించిన మూల్యాన్ని మనం మరచిపోకూడదు. మన శక్తితో దానిని రక్షించడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించుకుందాం’ అని ఆమె తెలిపారు. ‘కాంగ్రెస్‌ నాయకత్వంలో దేశం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్యమాన్ని బహిష్కరించడమే కాకుండా బ్రిటిష్‌ వారికి చురుకుగా మద్దతు ఇచ్చింది’ అని కాంగ్రెస్‌ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో హిందీలో పేర్కొంది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌)ను విమర్శిస్తూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌… 80 ఏళ్ల క్రితం మహాత్ముడు క్విట్‌ ఇండియాను ప్రారంభించిన ఈ చారిత్రాత్మక రోజున సంస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ‘ఇది ప్రజల ఉద్యమం నుంచి విడదీసి పక్కదారి పట్టింది. గాంధీ, నెహ్రూ, పటేల్‌, ఆజాద్‌, ప్రసాద్‌, పంత్‌, అనేక మంది జైలు పాలైనప్పుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ పాల్గొనలేదు’ అని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. క్విట్‌ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా హిందీలో ఒక సందేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను నిందించారు. దేశం మొత్తం ఐక్యంగా పోరాడుతున్నప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్యమాన్ని విరమించుకోవాలని భారతీయులకు విజ్ఞప్తి చేసింది. క్రూరమైన అణచివేత కాలంలో బ్రిటిష్‌ వారికి మద్దతు ఇచ్చింది. క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో ప్రతి తరగతి, కులం, మతం, ప్రాంతం, వయస్సుల ప్రజలు ఐక్యంగా ‘బ్రిటీషర్స్‌ క్విట్‌ ఇండియా’ అని ఒక పోరాట ఘోషను లేవనెత్తారని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ‘ఉద్యమం ప్రకటించిన వెంటనే గాంధీజీ, నెహ్రూ జీ, సర్దార్‌ పటేల్‌ జీ, న్యూదిల్లీ: క్విట్‌ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం పురస్కరించుకొని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం దేశ స్వాతంత్య్రాన్ని ‘మన శక్తితో’ రక్షించాలని ప్రజలకు ఉద్బోధించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆ సమయంలో బ్రిటిష్‌ వారికి మద్దతు ఇచ్చిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్త లను కొట్టి జైల్లో పెట్టిన ఈ చారిత్రాత్మక రోజున అరుణా ఆసిఫ్‌ అలీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆమె ధైర్యసాహసాలు మన స్వాతంత్య్ర తపనకు ప్రతీక అని సోనియా గాంధీ తన సందేశంలో అన్నారు. ‘మహాత్మా గాంధీ నేతృత్వంలోని క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని మనం స్మరించుకుంటున్నప్పుడు, భారతదేశ స్వాతంత్య్రం కోసం లక్షలాది మంది మన దేశస్తులు, మహిళలు చెల్లించిన మూల్యాన్ని మనం మరచిపోకూడదు. మన శక్తితో దానిని రక్షించడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించుకుందాం’ అని ఆమె తెలిపారు. ‘కాంగ్రెస్‌ నాయకత్వంలో దేశం బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్యమాన్ని బహిష్కరించడమే కాకుండా బ్రిటిష్‌ వారికి చురుకుగా మద్దతు ఇచ్చింది’ అని కాంగ్రెస్‌ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో హిందీలో పేర్కొంది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌)ను విమర్శిస్తూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌… 80 ఏళ్ల క్రితం మహాత్ముడు క్విట్‌ ఇండియాను ప్రారంభించిన ఈ చారిత్రాత్మక రోజున సంస్థ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ‘ఇది ప్రజల ఉద్యమం నుంచి విడదీసి పక్కదారి పట్టింది. గాంధీ, నెహ్రూ, పటేల్‌, ఆజాద్‌, ప్రసాద్‌, పంత్‌, అనేక మంది జైలు పాలైనప్పుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ పాల్గొనలేదు’ అని ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img