100 గ్రాములు అధిక బరువు ఉండటంతో అనర్హత వేటు
ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్!
వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుపై భారత్ అప్పీల్‌కు వెళ్ళిది. అమెపై అనర్హత వేటు పడటంతో ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లుగా తెలుస్తోంది. 50 కిలోల విభాగంలో ఈరోజు రాత్రికి ఆమె ఫైనల్‌లో తలపడాల్సి ఉంది. కానీ ఈరోజు ఉదయం ఆమె 50 కిలోల కంటే 100 గ్రాములు అధికంగా ఉంది. దీంతో ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెపై అనర్హత వేటు వేసింది. ఈ పరిణామంతో యావత్ భారతదేశం షాక్‌కు గురైంది.
తదుపరి ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తా
వినేశ్ ఫొగాట్ బంగారు పతకం తీసుకు వస్తుందని యావత్ భారతం ఎదురు చూస్తోందని ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ అన్నారు. 50 కిలోల విభాగంలో ఈ రోజు రాత్రి ఫైనల్లో ఆమె పోటీ పడాల్సి ఉంది. కానీ 50 కిలోల కంటే 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో మహావీర్ ఫొగాట్ స్పందిస్తూ… ఒలింపిక్స్‌లో రూల్స్ ఉంటాయని, కానీ ఎవరైనా రెజ్లర్ 50 లేదా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారన్నారు. దేశ ప్రజలు ఎవరూ నిరాశపడవద్దని కోరారు. ఆమె ఏదో ఒకరోజు తప్పకుండా మెడల్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెను తదుపరి ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తానన్నారు. ఇది నిజం కాకపోతే బాగుండు అని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.