Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

భారత్ లో ఉన్నత ఉద్యోగులపై మెటా వేటు

ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా (ఫేస్ బుక్) భారత దేశంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేసింది. తమ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు ఉన్నతోద్యోగులపై కూడా వేటు వేస్తోంది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ (లే ఆఫ్స్) చేపట్టినట్టు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మార్చిలోనే ప్రకటించారు. తాజా దశలో భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై ప్రభావం చూపింది. పరిపాలన, మానవ వనరులు, మార్కెటింగ్ వంటి అనేక విభాగాలలో తొలగింపులు జరుగుతున్నాయి.వేటు ఎదుర్కొన్న వారిలో భారత మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్ట్ నర్షిప్స్ డైరెక్టర్ సౌరభ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్ కంపెనీ గతంలో తొలగించిన ఉద్యోగులకు అందించిన పరిహార ప్యాకేజీని తాజాగా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఇస్తోందని మాజీ మెటా ఉద్యోగి వెల్లడించారు. ఈ ప్యాకేజీ దాదాపు 3 నెలల మూల వేతనంతో సమానంగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img