Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నేడు పార్లమెంటుకు హాజరైన రాహుల్‌ గాంధీ

పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష తర్వాత శుక్రవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంటుకు హాజరయ్యారు. అధికార, ప్రతిపక్షాల నిరసనల మధ్య మధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన వెళ్లిపోయారు. జైలు శిక్ష నేపథ్యంలో ఆయన ఎంపి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందా లేదా ఎంపి పదవి పూర్తయ్యే వరకు వెలుసుబాటు ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. నేరం రుజువైతే ఎంపిలు తమ సభ్యత్వం కోల్పోవలసి వస్తుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 8(1) ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడితే వారు ఆ పదవికి అనర్హులవుతారు. సూరత్‌ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని లోక్‌సభ సెక్రటేరియట్‌ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పులో పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్‌కి 30 రోజుల గడువు ఉన్నందున లోక్‌సభ సెక్రటేరియట్‌ అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ రాహుల్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకుంటే.. శిక్ష తగ్గించే అవకాశం కూడా ఉందని, దీంతో పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img