Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

మరో 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులను తాకనున్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాల ఆగమనం ఈ ఏడాది కాస్త ఆలస్యం కానుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే, ప్రస్తుత వాతావరణం రుతుపవనాల పురోగమనానికి అనువుగా ఉందని వెల్లడించింది. రుతుపవనాల గమనం నిలకడగా కొనసాగుతోందని పేర్కొంది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని వివరించింది. రుతుపవనాలు మరో రెండ్రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయని వెల్లడించింది.ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఏపీతో పాటు యానాంలోనూ పశ్చిమ-నైరుతి గాలుల ప్రభావం ఉందని ఐఎండీ వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img