Friday, April 19, 2024
Friday, April 19, 2024

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై పిల్.. విచారణకు స్వీకరించని సుప్రీంకోర్టు

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ను భారత రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని.. దీనిపై లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్దాఖలైంది. అయితే ఈ పిల్ పై విచారణ జరిపేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది.సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ వేసిన పిల్ పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మీరు ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో మాకు తెలుసు. దీన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము్ణ్ణ అని సుప్రీంకోర్టు పేర్కొంది. మీకు ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించండి్ణ్ణ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.

వ్యాజ్యాన్ని కొట్టివేయాలని బెంచ్ నిర్ణయించింది. ఈ సమయంలో పిటిషనర్ స్పందిస్తూ.. తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు.వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో పిటిషనర్ కొంతసేపు వాదించిన తర్వాత.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు్. అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img