విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 78 వ వార్షికోత్సవంనిపురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ఎంప్లాయిస్అసోసియేషన్, నెల్లూరు రీజియన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానెల్లూరు ప్రధాన శాఖ వద్దచలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,నెల్లూరు రీజియన్ హెడ్,కె.జోగ రావు ముఖ్య అతిధిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం చెయ్యండం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రీజియన్,రీజినల్ కార్యదర్శి మహబూబ్ బాషా రాష్ట్ర కోశాధికారి . సుమన్,రాష్ట్ర సహాయక కోశాధికారి . వెంకటేశ్వర్లు,మృదుల,ప్రసాద్,పరమేశ్వర, శ్రీకాంత్ రెడ్డి, ఆఫీసర్,పదవీవిరమణ నాయకులు,ఇతర యూనియన్ల నాయకులు, సభ్యులు హాజరవ్వడం జరిగింది. అనంతరం
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం ఆధ్వర్యంలో గొల్లపాలెం గ్రామం,అల్లూరు మండలం లో ఉన్న చిన్నపిల్లల ఆశ్రమంలో పిల్లలకు మధ్యాహ్నం భోజనం కల్పించడం, సాయంత్రం 78 బొప్పాయి చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్డ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు . ఉదయ కుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ . సుమన్,ఇతర నాయకులు . మహబూబ్ బాషా,పరమేశ్వర, మృదుల,. శ్రీకాంత్ రెడ్డి,కిరణ్,అరిప్రసాద్,వెంకటేశ్వర్లు,రామకృష్ణ,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.