నెల్లూరు ఏఎంసీ చైర్మన్ తో పాటు పలు అంశాలపై చర్చ
ఏఎంసీ చైర్మన్ గా పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి కి ఆమోద ముద్ర వచ్చేలా చూడాలని కోరిన ఆదాల.
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : తన శాఖల పరిధిలో నెల్లూరు రూరల్ కి సంబంధించి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించిన మంత్రి కాకానినెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య సుదీర్ఘంగా పలు అంశాలపై మాటామంతి సాగుతోంది. నెల్లూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఇప్పటివరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడైన కూకటి హరిబాబు వ్యవహరిస్తున్నారు.. ఆదాలను నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన కోకట హరిబాబు మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు అడుగులు వేయడంతో ఎలాగైనా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాన్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఆదాల అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు ఎఎంసి చైర్మన్గా పేర్నేటి కోటేశ్వర్ రెడ్డి పేరును మంత్రి కాకాని దృష్టికి తీసుకువచ్చారు. అత్యవసరంగా ఈ పేరుకు ఆమోదముద్ర వేయాలని అందుకు సంబంధించి జీవో తీసుకురావాలని మంత్రిని కోరారు. అలాగే రూరల్ కు సంబంధించి కొన్ని అపరిష్కృత సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే నెల్లూరు రూరల్ కు సంబంధించిన అంశాలతో పాటు జిల్లా రాజకీయ అంశాలపై వారు సుదీర్ఘంగా మంతనాలు సాగించినట్లు సమాచారం నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని నిలువరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.