సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ఈ,శ్వరయ్య
పిడిఎఫ్ ఎమ్మెల్సీఅభ్యర్థులను గెలిపించండి!
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, జిఈశ్వరయ్యలు పిలుపునిచ్చారు. ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులైన మీగడ వెంకటేశ్వర్ రెడ్డి, బాబు రెడ్డిలను గెలిపించండి అంటూ నెల్లూరులోని సంతపేటలో సిపిఐ కార్యాలయంలోసోమవారంవారు విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగుల,కార్మికుల,కష్టజీవుల సమస్యలపై పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిరంతరం పోరాడారని అన్నారు.గతంలో మూడుసార్లు పిడిఎఫ్ అభ్యర్థులను పట్టభద్రులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, మేధావులు గెలిపించారు అని అన్నారు. శాసనమండలిలో వీళ్లు ఉద్యోగులు నిరుద్యోగులు సమస్యలపై, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తమ గళాన్ని వినిపించారని అన్నారు. మార్చి 13వ తేదీ జరుగుతున్న ఎన్నికలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కార్మిక వర్గానికి, ఉద్యోగులకి, మేధావులకు, వామపక్ష పార్టీలకు సంబంధించిన అన్ని కార్మిక సంఘాలకు, ప్రజా సంఘాలకుపిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి గడిచిన నాలుగు సంవత్సరాలుగా నీటి ప్రాజెక్టుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని జగదీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టబోయే ఆఖరి బడ్జెట్లో నీటి ప్రాజెక్టులకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇటీవల విశాఖపట్నం జరిగిన పారిశ్రామిక సదస్సులో కోట్ల రూపాయలు వస్తున్నాయని ప్రజలను మోసపు మోసం చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకమేనని వాస్తవంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పని చేసినా అందుకు సంబంధించిన వారికి డబ్బులు చెల్లిస్తున్నదా అని జగదీష్ ప్రశ్నించారు దీనితో కాంట్రాక్టర్లు పనులు చేయటానికి ఎవరు సిద్ధంగా లేరని తేటతెల్లమైపోతుంది చేసిన పనులకు బిల్లుల కోసం వెళితే చెల్లించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆయన విమర్శించారు. పరిశ్రమలు ఎవరైనా పెట్టేందుకు ముందుకు వచ్చిన అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు వారిని వాటాల పేరుతో కమిషన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకోవడంతో వారెవరు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. మరో రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలకు లో 175 స్థానాలు గెలవాలనేటువంటి ఆశ ఉండడం మంచిది కానీ గడచిన నాలుగు సంవత్సరాలలో నీ ప్రభుత్వం నిరుద్యోగులకు అవసరమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసినందుకు, లేక నాలుగు సంవత్సరాలలో నాలుగు సార్లు కరెంట్ బిల్లులు పెంచినందుకు, డీఎస్సీని ప్రకటించినందుకు, రాష్ట్రంలో చెత్త పనులు విధించినందుకు, పరిశ్రమలన్నిటికీ శంకుస్థాపనలకు తోనే ఆపేసినందుకు నీకు 175 స్థానాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెళ్లికి ప్రాజెక్టుల గురించి ఏ రోజు నీకు పట్టలేదు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఎగువ భద్ర ప్రాజెక్టుకు 18 నెలలలో బిజెపి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేస్తుండు దాన్ని వలన రాయలసీమ పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని విషయం నీకు తెలుసా దాని మీద నువ్వు ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించావా ఏమి చేసావని నీకు 175 స్థానాలు ఇవ్వాలి, తిరిగి ప్రజలను ఓట్లు అడిగేందుకుఅసలు నీకు సిగ్గు ఉందా నీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నాలుగు అంశాలు ల్యాండ్,
శాండ్, వైను, మైను, పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న సంగతి నీకు తెలియదా ఒక్కసారి అధికారం ఇవ్వండి అని అడిగావు అధికారం ఇచ్చిన తర్వాత నీవు చేసింది ఏంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్న భిన్నం తప్ప యువతను మోసం చేసావు ఉద్యోగస్తులను మహిళలను మోసం చేశావు ఎవరిని నీవు మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని చెప్పి ఎన్నికలలోకి రావాలి అని ఈశ్వరయ్య అన్నారు.
ఈ కార్యక్రమంలోజిల్లా సిపిఐజిల్లా కార్యవర్గ సభ్యులుఅరిగెల నాగేంద్రసాయి, మాలకొండయ్య, ఎస్ డి సిరాజ్, మధు, షాన్వాజ్, నందిపోగులరమణయ్య,సురేష్ చిన్న అంకయ్య, నందయ్య, ఆనంద్, మున్వర్, తదితరులు పాల్గొన్నారు.