Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకు నగదు బహుమతి

మర్రిపాడు – కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాలలో గత రెండు సంవత్సరాలలో పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరచి మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన ఏడుగురు విద్యార్థులకు సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్ష రూపాయలు నగదు బహుమతిని అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి ఓబుల్ రెడ్డి మరియు వారి సోదరులు శ్రీనివాసులు రెడ్డి,కేశవరెడ్డి ఈప్రాంత విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని,అందులో భాగంగా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేస్తున్నామని,విద్యార్థులు ట్రస్టు సేవలను ఉపయోగించుకొని బాగా చదివి మంచి స్థాయికి రావాలని ఆకాంక్షించారు.అనంతరం కదిరినాయుడు పల్లి కాంప్లెక్స్ లోని అన్ని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు,ఇతర విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా సుజాతమ్మ చారిటబుల్ ట్రస్ట్ మరియు రామిరెడ్డి గంగిరెడ్డి రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు విద్య వైద్య రంగాలలో చేస్తున్న సేవలు అమోఘమని,ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారని,వైద్య పరంగా అనేకమందికి సహాయ సహకారాలు అందించారని,రామిరెడ్డి సోదరులు అమెరికాలో ఉంటున్నప్పటికీ వారి మనసంతా మన ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు మీదే ఉంటుందని,అన్ని దానాల కన్నా విద్యా దానం మహాదానమని వారు నమ్ముతారని,వారి సేవలను ఘనంగా ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img