Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏపీయూడబ్ల్యూజే నిరసన ర్యాలీ

విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నెల్లూరు నీ ప్రెస్ క్లబ్ దగ్గర నుండి బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయశీ వెళ్లి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కి విన్నతి పత్రం. అందజేయడం జరిగింది ఏపీయూడబ్ల్యూజే.రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగే కార్యక్రమంలో భాగంగా నెల్లూరుజరిగింది. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టుల పైన జరిగిన దాడులను ఖండిస్తూ తక్షణం దాడులు అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు ఎలక్ట్రానిక్ మీడియా సంఘం అధ్యక్షులు రమేష్ బాబు యూనియన్ ఉపాధ్యక్షులు దయాశంకర్, రవి కోశాధికారి హనూక్ ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇంచార్జ్ రామకృష్ణ, నాగరాజు యూనియన్ కార్యవర్గ సభ్యులు మహిళా జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లు కెమెరామెన్లు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు స్థానిక పత్రికల ప్రతినిధులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కావలిలో ఆర్డీవోకు ఏపీడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రాలు అందజేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img