Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి 3రోజులు జైలు శిక్ష-యస్పి విజయ రావు

విశాలాంధ్ర బ్యూరో`నెల్లూరు :16 కేసులలో 16 మందికి 3 రోజులు జైలు శిక్ష. నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులనుఅభినందించిన యస్‌.పి. అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ , మైనర్‌ డ్రైవింగ్‌ లపై ప్రధానంగా దృష్టి సారించాము. తస్మాత్‌ జాగ్రత్త.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. ప్రజలు సహకరించాలి.రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను పూర్తిగానియంత్రించవచ్చు. నెల్లూరు జిల్లా యస్పి విజయ రావు, జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్‌ వాహనాలు, మైనర్‌ డ్రైవింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తూ పోలీసు అధికారులు నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తూ, జరిమానాలు విధిస్తున్నారు.
జిల్లాలో హైవే, అన్ని కూడళ్ళలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని, చెక్‌ పోస్ట్‌ లు, పికెట్స్‌ లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసామని, నిరంత రద్దీ, శివారు ప్రాంతాలలో విస్తృతంగా విజబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్నామని, రోడ్డు భద్రత నియమాలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చలానా ద్వారా జరిమానా విధిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని సూచించారు.అందులోభాగంగానార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులు మద్యంతాగి వాహనాలు నడుపుతున్న 16 మందిపై కేసులు నమోదు చేసి రెండవ కోర్టు నందు ప్రవేశపెట్టగా గౌరవ జడ్జి ఇ. ప్రసూన గారు ఈ రోజు 16 కేసులలో 16 మందికి 3 రోజులు జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా జిల్లా యస్‌.పి. గారు నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, కోర్టు లైజన్‌ అధికారులను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img