Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం ఉంటే బాగుంటుందని మాజీ మంత్రి ఆనం

విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యేఆనంరామనారాయణరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోరాజకీయ అనిశ్చితి నెలకొంది.రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన వ్యక్తి అభిప్రాయాలను పట్టించుకొకపోవడం దారుణం.రాజ్యాగేతర శక్తులు అధికారం చేలాయించడం సరికాదుఅధికారులతో రాజకీయాలు చేస్తున్నారురాజ్యాంగ ఇతర శక్తుల ద్వారా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.స్థానిక సంస్థల సమావేశాలకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారికి మాత్రమే ఆహ్వానం ఉండాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లుఉంటుంది.రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పదవిలో పూర్తి కాలం కొనసాగుతా.రాజ్యాంగ ఇతర శక్తులను పెట్టి అధికారులను బదిలీలు చేసి పాలన కొనసాగిస్తామంటే ఎలా.నాకు ఉన్న సెక్యూరిటీ తగ్గించారు.అందరినీ తీసేయమని కోరా..
40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం లో రాజకీయంగా కుటుంబ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.ప్రస్తుతంఅన్నీచూస్తున్నాం..ఆలోచించి స్పందిస్తా.ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.ప్రజలుఎలానిర్ణయిస్తారోచూడాలి.వైకాపాకిసంబంధించివెంకటగిరినియోజకవర్గంబలమైనదిఅలాంటి దాంట్లోవైసిపిలోమూడువర్గాలు తయారయ్యాయిగతఎన్నికల్లోజగన్ కుభారీమెజారిటీ ఇచ్చారు.
ప్రభుత్వ పనితీరు పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయినాలుగు సంవత్సరాలకే ఇలా రావడం ప్రభుత్వ తీరుపై అద్దం పడుతోంది
గతంలో తెదేపా పాలన.ఇప్పటి వైకాపా పాలనను ప్రజలు బేరీజు వేస్తున్నారు
ప్రజా ప్రతినిధులను రాజ్యాంగ విధుల నుంచి దూరం చేయడంరాష్ట్రపరిస్థితులపై ఆనం మాట్లాడుతూఏపీలోరెండుప్రాంతీయపార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి మూడో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని మేధావులువిజ్ఞులురాజకీయ విశ్లేషకులుఆలోచించాలిమూడోప్రత్యామ్నాయంఉంటేబాగుంటుంది.ఇదినాఅభిప్రాయంఅనిమీడియాతోఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఇది ఏమైనా జిల్లాలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img