విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: ఏఐటియుసి 104వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నెల్లూరు నగరంలోని రేబాల వీధిలో గల గుజ్జుల ఎలమందారెడ్డి భవన్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ అధ్యక్షత వహించగా జిల్లా గౌరవ అధ్యక్షులు కే ఆంజనేయులు ఏఐటీయూసీ పథకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక రద్దు చేస్తున్న కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైనదని పూర్తిగా కార్మిక సంఘాలను కార్మిక హక్కులను అణగదొక్కాలని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్నిగద్దదింపేందుకు ప్రతి కార్మికుడు సిద్ధం కావాలని రానున్న ఎన్నికలలో కేంద్రంలోబిజెపినీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని సాగనంపెందుకు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిలాని ఖాన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య సిపిఐ నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ఏఐటీయూసీ మాజీజిల్లా కార్యదర్శి వి రామరాజు, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ముక్తియార్, ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు చిన్నయ్య రమణయ్య బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ఉద్యోగుల సంఘం నాయకులు మీరా తదితరులతో పాటు పలువురు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. అలాగే జిల్లాలో కావలి ఆత్మకూరు కందుకూరు తదితర ప్రాంతాలలో కూడా ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయని జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ తెలిపారు..