Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మండలంలో ఘనంగా 77వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం. మండలంలోని ప్రభుత్వకార్యాలయాలు,ప్రభుత్వపాఠశాలు,సశివాలయాలలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మంగళవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం,యంపిడిఓ కార్యాలయం,వైయస్సాఆర్ క్రాంతి పథకం కార్యాలయం ,మండలప్రాథమిక ఆరోగ్యఉపకేంద్రం,పశువైద్యశాల,చుండి ఆదర్శ పాఠశాల, కస్తూర్బా పాఠశాల,మండలం లోని సశివాలయాలు, పోలీస్ స్టేషన్,కరెంట్ సబ్ స్టేషన్ లలో, ప్రభుత్వమరియు ప్రయివేట్ పాఠశాలలో జాతీయ జండాను ప్రజాప్రతినిధులు,అధికారులు ఆవిష్కరించారు.ఈ సందర్బంగావారు మాట్లాడుతూఆనాడు స్వాతంత్ర ఉద్యమంకోసం అనేకమంది త్యాగమూర్తులు పోరాడి మనకు స్వాతంత్ర్యం తెచ్చారని మనకు స్వాతంత్రం వచ్చి నేటికి 77సంవత్సరాలు అయినదని అన్నారు.నేటి యువత ఆనాటి త్యాగమూర్తుల ఆశయాలకు అనుగుణంగా నడుసుకొని వారి ఆశయసాధన కోసం కృషి చేయాల్చిన ఆవశ్యకత ఎం తైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ ఇంటూరి భారతి,ఎంపీపీ పొనుగోటి మౌనిక,ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ,పశువైద్యశాల ఏడి కె.వి.బ్రహ్మయ్య,ఎస్ ఐ బాలు మహేంద్ర నాయక్,చుండి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీవేంకటేశ్వర్,కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్దిని,విద్యుత్ ఏ ఈ మధుబాబు,ఎంపీటీసీలు చింతలపూడి రవీంద్ర,చౌడబోయిన యానాది,సర్పంచ్ లు ఇరుపని సతీష్,యాళ్ల సుబ్బరాజ్యం,డేగా వెంకటేశ్వర్లు,చెన్నెబోయిన ఓబులుకొండయ్య,సాదు శ్రీలత, పారాబత్తిన కొండమ్మ,అనుమోలు అమరేశ్వరి,వింజం వెంకటేశ్వర్లు,మన్నం వెంగమ్మ,గడ్డం భవాని,పర్రె కనకరత్నం,నవులూరి రాజా రమేష్,దువ్వూరి కృపమ్మ,దుగ్గిరాల రాఘవులు,దార్ల కోటేశ్వరమ్మ, నత్తావరమ్మ ,కొల్లూరి లక్షమ్మ,నాయకులు ఇంటూరి హరిబాబు,అనుమోలు వెంకటేశ్వర్లు,పరిటాల వీరాస్వామి,మన్నం వెంకటరమేష్,ఇరుపని అంజయ్య,యాళ్ల శివకుమార్ రెడ్డి,యాళ్ల హరిబ్రహ్మారెడ్డి,కట్టా హనుమంతురావు,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,నలమోతు చంద్రమౌళి,నవులూరి హజరత్తయ్య,వడ్లమూడి రమేష్,స్వర్ణ మాలకొండయ్య, గడ్డం మాధవరావు,గడ్డం శివరామయ్య నత్తా బాబూరావు, గుత్తా గోపి,పర్రె జగదీష్,దువ్వూరి ప్రసాదు, ఉన్నం వెంకటేశ్వర్లు,ఉపసర్పంచ్ లు గురజాల క్రిష్టయ్య,మద్దులూరి కొండలరావు,నరసింహారావు, అధికారులు,ఉపాధ్యాయులు,సశివాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది,వెలుగుసీసీలు, ఏఎన్ యం లు, ఆచాలు,వలంటీర్లు, వైసీ పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img