Monday, August 15, 2022
Monday, August 15, 2022

ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరించాలనే స్పందన కార్యక్రమం

నెల్లూరు, జూలై 21 : ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్ సూచించారు
గురువారం మధ్యాహ్నం నెల్లూరు శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రంలో నెల్లూరు, ఆత్మకూరు డివిజన్ల పరిధిలోని మండల స్థాయి అధికారులకు స్పందన కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందనకు ప్రజల నుండి అందే అర్జీలను నిశితంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆ అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి అర్జీదారుడికి సమాచారం తెలపడం ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని చెప్పారు. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ రాకుండా, ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో అర్జీదారుడికి వివరంగా చెప్పాలన్నారు. అర్జీ పరిష్కారం తమ పరిధిలో లేనప్పుడు ఆ అర్జీని సంబంధిత అధికారికి బదలాయించాలన్నారు. స్పందన అర్జీ రిజిస్ట్రేషన్ సమయంలో అర్జీ కి అనుబంధంగా ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలన్నారు. నెల్లూరు ఆర్డిఓ శ్రీ పి కొండయ్య మాట్లాడుతూ స్పందన అర్జీలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని చెప్పారు. ప్రతిరోజు స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు అందరూ కొంత సమయం కేటాయించాలని సూచించారు.
విజయవాడ నుంచి వచ్చిన స్పందన స్పెషల్ టీం సభ్యులు శ్రీ శీను, శ్రీ కిరణ్ అధికారులకు స్పందన కార్యక్రమం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్పందన అర్జీ రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన అర్జీ లే మళ్లీ మళ్లీ రాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో డిఆర్డిఎ పీడి శ్రీ సాంబశివారెడ్డి, జిల్లా ఈ-మేనేజర్ శ్రీ శ్రీరాములు, ఎంపీడీవోలు, తాసిల్దార్లు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img