Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

భవనం మీద నుండి పడి యువకుడు మృతి

చిట్టమూరు(విశాలాంధ్ర) మండలంలోని కొత్తగుంట కూడలిలో నిర్మాణంలో ఉన్న భవనం మీద నుంచి పడి బురదగాలి కొత్తపాలెం దళితవాడకు చెందిన ఇలపు వెంకటాద్రి(26) మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది స్థానికుల కథనం మేరకు కొత్తగుంట కూడలిలో నాలుగంతస్తుల భవన నిర్మాణ పనులు జరుగుతుండగా కూలీ పనుల నిమిత్తం మంగళవారం పనులు చేస్తున్న సమయంలో మాధవశాత్తు వెంకటాద్రి అనే యువకుడు పక్కనే ఉన్న రేకుల షెడ్డు పై పడి గాయాల పాలు అవడం ప్రైవేటు వాహనంలో నాయుడుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే వెంకటాద్రి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు వెంకటాద్రి మృతితో బురదగాలి కొత్తపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img