విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : ఆఫ్కాస్ నిబంధనలను పక్కన పెట్టిన కావలి మున్సిపల్ కమిషనర్ పైచర్య తీసుకోవాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ను కోరారు. నెల్లూరులోని ఆయన క్యాంపుకార్యాలయంలో శుక్రవారం వినతిపత్రాన్నిఅందించారు ఈసందర్భంగా దామ అంకయ్య మాట్లాడుతూ ఆఫ్కాస్ నిబంధనలకు విఘాతం కలిగిస్తున్న కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణనికోరడంజరిగింద
సుమారు పది సంవత్సరాల నుండి కావలి మున్సిపాలిటీలో 100మంది డైలీవెజ్లో పనిచేస్తున్నారు. వీరందరూ 2020 నవంబర్ నెలలో ఆఫ్కాస్ లో చేర్చుకోవాలి కానీ చేర్చుకోలేదు కావలి మున్సిపల్ కమిషనర్ కూడా 2016నుండిపనిచేస్తున్న కార్మికులను ఆఫ్కాస్ లో చేర్పించుకోకుండా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారని దాదాపు 27 మందిని అప్కస్లో చేర్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడుఇదినిబంధనలకువ్యతిరేకంఇప్పటికైనామున్సిపల్ కమిషనర్ తన తప్పుడు నిర్ణయాన్నిఉపసంహరించుకొని 2016 నుండి పనిచేస్తున్న కార్మికులను ఆప్కాస్ లో చేర్పించుకోవాలని కోరాము మా కోరికను పెడచెవిన పెట్టి అక్రమపద్ధతిలోవాళ్ళిష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లాం వెంటనే స్పందించి కార్మికులకు తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులునందిపోగురమణయ్యఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నాతదితరులు పాల్గొన్నారు.