Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తిరుపతి ప్రసూతి ఆసుపత్రిని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కేటాయించడం దుర్మార్గం : సిపిఐ

విశాలాంధ్ర – సూళ్లూరుపేట : రాయలసీమ జిల్లాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతి ప్రసూతి వైద్య కేంద్రాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కేటాయించడం దుర్మార్గమని తక్షణం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ రెడ్డి కోరారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని కలిసి తిరుపతి ప్రసూతి వైద్య కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలోనే 1962లో ఏర్పాటు చేయబడి ఈనాటికి కూడా దిగ్విజయంగా ఎంతో మంది గర్భిణీలకు వైద్య సేవలు అందిస్తున్న తిరుపతి ప్రసూతి వైద్య కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించకపోతే రోజుకు కనీసం 400 నుండి 500 వరకు నిత్యం గర్భిణీలకు వైద్య సేవలు అందించే సదుపాయాన్ని కోల్పోతామని అంతేకాకుండా ప్రసూతి వైద్య కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని ఎస్వీ మెడికల్ కళాశాలలో అదనంగా కేటాయించబడిన 40 గైనకాలజీ వైద్య సీట్లను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రసూతి వైద్య కేంద్రంలో అత్యాధునికమైన మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారని ఈ ప్రసూతి వైద్య కేంద్రాన్ని యధావిధిగా కొనసాగిస్తూ మున్సిపల్ కార్యాలయానికి వేరే ఏదైనా ప్రత్యామ్నాయం చూస్తే బాగుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు టి రమణయ్య నాగేంద్రబాబు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పార్థసారథి ఆనంద్ ప్రభుదాస్ మహిళా సంఘం నాయకురాలు లక్ష్మి , రామచంద్ర బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img