Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

అంగన్వాడీ కార్యకర్తలు గ్రామానికి వెన్నెముక.సర్పంచ్,సీడీపీఓ

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : అంగన్వాడీ కార్యకర్తలు గ్రామానికి వెన్నెముక లాంటి వారని పోలినేనిచెరువు సర్పంచ్ యాళ్ల సుబ్బరాజ్యం,సీడీపీఓ శర్మిష్ఠ అన్నారు.కందుకూరు ప్రాజెక్టు పరిధిలోని వలేటివారిపాలెం సెక్టార్-2లోని గరుకుపాలెం అంగన్వాడీ కేంద్రం నందు బుధవారం సీడీపీఓ శర్మిష్ఠ అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో పోషణ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక సర్పంచ్ యాళ్ల సుబ్బరాజ్యం హాజరైనారు ఈ సందర్భంగా సర్పంచ్ యాళ్ల సుబ్బరాజ్యం,సీడీపీఓ శర్మిష్ఠ మాట్లాడుతూ రైతులు దేశానికి ఏవిధంగా వెన్నెముక లాంటి వారో గ్రామానికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు వెన్నెముక లాంటి వారన్నారు. గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలని ఆదేశించారు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యమన్నారు. గర్భిణులు కాన్పు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు. పుట్టిన పిల్లలు వయస్సుకు తగిన బరువు, ఎత్తు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంట్లోను మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనేటట్లు మహీళల్లో అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత,అంగన్వాడీ కార్యకర్త అమరజ్యోతి,ఆయా దుడ్డు అంకమ్మ,ఏఎన్ ఎం,ఆచా కార్యకర్త,వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు,తల్లులు,బాలింతలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img