టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్రహం..
- మైపాడ్ గేట్ వద్ద ఇళ్లు, దుకాణాలు కూల్చవేతపై కోటంరెడ్డి ఆగ్రహం..
- రెండు చోట్ల వందల కోట్లతో ఇళ్లు కట్టుకున్న అనీల్ కు.. ప్రజల బాధలు ఎలా తెలుస్తాయి..
- నోటీసులు ఇవ్వకుండా.. ఇళ్లను ఎలా కూల్చేస్తారని ఆగ్రహం..
- నూతనంగా ఇళ్లు, దుకాణాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామని కోటంరెడ్డి హెచ్చరిక..
- ఒక్కో కుటుంబానికి, దుకాణానికి రెండు వేల చొప్పున ఆర్దిక సాయం చేసిన కోటంరెడ్డి..
సాలుచింతల్లో ఇళ్లు తొలగిస్తే చొక్కా చింపుకుని రోడ్డుమీద పడ్డ అనీల్ కుమార్ యాదవ్.. జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో నిర్దాక్ష్యంగా ఇళ్లు ఎలా కూల్చేశాడని టీడీపీ సిటీ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉన్నపళంగా ఇళ్లు కూల్చేస్తే నిరుపేదలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు..
మైపాడు గేట్, జాఫర్ సాహెబ్ కాలువ ప్రాంతంలో ఆయన పర్యటించారు. బాధితులతో మాట్లాడారు.. ఈ సందర్బంగా వారి గోడు కోటంరెడ్డి ముందు వెళ్లగక్కారు.. నమ్మి ఒట్లేస్తే.. మమల్ని రోడ్డున పడేశాడంటూ కన్నీరు కార్చారు.. ఆయన కోట్లరూపాయలతో ఇళ్లు కట్టున్నారని.. మమల్ని మాత్రం.. కట్టుబట్టలతో రోడ్డున పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చలించి పోయిన కోటంరెడ్డి ఒక్కో ఇంటికి, ఒక్కో దుకాణానికి రెండు వేలు చొప్పున ఆర్దిక సాయం చేశారు.. సామాన్లు వేరే చోటకు తరలించుకునేందుకు నగదును ఉపయోగించుకోవలన్నారు.. అనంతరం మాజీ మంత్రి అనీల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాక్షస పాలనలో రోజుకో చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.. 40 ఏళ్లుగా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్న ప్రజలపై అనీల్ కుమార్ కక్ష కట్టారని మండిపడ్డారు. .కనీకరం కూడా లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా.. ఇళ్లను ఎలా కూల్చేస్తారని ఆయన ప్రశ్నించారు.. అభివృద్దికి తాము అడ్డుకాదని.. కానీ ప్రత్యామ్నాయం చూపకుండా..ఇళ్లను ఎలా కూల్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అర్దరాత్రి సమయంలో జేసీబీతో ఇళ్లను కూల్చడం దుర్మార్గం అన్నారు..వారి కన్నీటికి అనీల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..వారి ఉసురు అనీల్ కు తప్పకుండా తగులుతుందని హెచ్చరించారు.. గతంలో సీపీఎం నేతలతో కలిసి తాము పోరాటం చెయ్యడం వల్లే కరెంట్ మీటర్లకు కనెక్షన్ ఇచ్చారని.. కానీ నిర్దాక్ష్యణంగా ఇళ్లు కూల్చడం దారునమన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మధు, కువ్వరపుబాలాజీ ,జహీర్,పసుపులేటి మళ్ళీ,నాగేంద్ర,రామగిరి సుబ్బు,శశి,ప్రసాద్,శ్రీరాములు, ,వేణు,కార్తిక్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు..