Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పేదవాడి ఆకలి తీర్చేందుకు “అన్న క్యాంటీన్

విశాలాంధ్ర – వెంకటగిరి : వెంకటగిరి నియోజకవర్గ టిడిపి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి, వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ. కురుగొండ్ల రామకృష్ణ గారు… తన 60 వ పుట్టినరోజు జూలై 17న వెంకటగిరి పట్టణం, ఎంపీడీవో ఆఫీస్ ముందు ప్రారంభించిన అన్న క్యాంటీన్” మంగళవారం నాడు9 వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం శ్రీ.కురుగొండ్ల రామకృష్ణ గారు “అన్న క్యాంటీన్” సందర్శించి…తన స్వహస్తాలతో పేద ప్రజలకు భోజనాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా శ్రీ.కురుగొండ్ల రామకృష్ణ గారు అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేద ప్రజలకు కేవలం 5 రూపాయల అతి తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో…తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు… వారి ఆశీస్సులతో “అన్న క్యాంటీన్” ను తన స్వంత నిధులతో ప్రారంభించినట్లు శ్రీ. కురుగొండ్ల”అన్న క్యాంటీన్” ను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ. కురుగొండ్ల కోరారు. ప్రతిరోజు, ప్రతిపూట దాదాపు 350 మంది నిరుపేద ప్రజలు “అన్న క్యాంటీన్” లో కేవలం 5 రూపాయలకే భోజనం చేసి… మాజీ ఎమ్మెల్యే శ్రీ. కొరుగొండ్ల రామకృష్ణ గారికి… అన్నదాత సుఖీభవ అంటూ ఆశీస్సులు అంద చేస్తున్నారని “అన్న క్యాంటీన్’ నిర్వాహకులు శ్రీ.మంకు ఆనంద్ శ్రీ గల్లా శ్రీనివాసులు గార్లు అన్నారు… “అన్న క్యాంటీన్” నిర్వహణలో టిడిపి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి తమ సేవలను అందిస్తున్నారని. తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img