Friday, September 22, 2023
Friday, September 22, 2023

అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు

ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ డిఎస్పి జి.అర్.అర్.మోహన్ నేతృత్వంలో నలుగురు సిఐలు, మరో 10 మంది సిబ్బందితో దాడు లు నిర్వహించారు. ఈ దాడులలో మున్సిపల్ కమీషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్ దగ్గర అక్రమంగా ఉన్న1.93 లక్షల నగదును స్వాధీనం చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. అధికారులు రావడం గమనించిన కమీషనర్ కిటికీలోంచి నగదును బయటికి విసిరేయగా అధికారులు గుర్తించి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలలో మరింత భారీ మొత్తంలో నగదు దొరికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం భవన నిర్మాణం అనుమతుల విభాగంలో అక్రమాలు అధికంగా ఉన్నట్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. సూళ్లూరుపేట ప్రాంతంలో పలు ప్రభుత్వ శాఖలలో అవినీతి తాండవిస్తున్నట్టు అధిక సంఖ్యలో ఫిర్యాదులు ఏసీబీ కార్యాలయానికి చేరుతున్నట్లు ప్రాథమిక సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img