Friday, December 2, 2022
Friday, December 2, 2022

నిలిచిన దేవస్థానం భూముల కౌలు వేలం పాటలు

విశాలాంధ్ర వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం శాఖవరం గ్రామంలో కొలువుతీరి ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానం కు చెందిన భూములు కౌలు వేలంపాట వాయిదా పడింది గతంలో కంటే భూములను తక్కువ కౌలుకు రైతులు పాట పాడటంతో అధికారులు వేలంపాటను రద్దు చేశారు ఆలయానికి సంబంధించి 25.42ఎకరాల శాఖవరం రెవెన్యూ మెట్ట భూమికి నిర్వహించిన వేలం పాట ఇప్పటికీ మూడుసార్లు వాయిదా పడింది. నాలుగవసారైనా వేలంపాట సజావుగా సాగేనా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఆలయ ఉన్నతాధికారులతో మాట్లాడి కవులు వేలంపాటల గురించి చర్చిస్తామని చెప్పారు. వేలంపాట ఎప్పుడు నిర్వహించేది వివరాలు బహిరంగంగా తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.వో.డి వంశి ,సిబ్బంది పావని, గ్రామస్తులు,పాటదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img