ఉలవపాడు : జి.వి.ఎస్.ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉలవపాడు నందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. లక్ష్మీ సుధారాణి గారి అధ్యక్షతన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ అవగాహనా కార్యక్రమం జరిగింది. అనంతరం ఆరోగ్య కార్యకర్తల పర్యవేక్షణలో విద్యార్థులకు మరియు కళాశాల సిబ్బందికి బూస్టర్ డోస్ టీకాలు వేశారు. ఈకార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.