Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బాధ, భారం కలిగించిన ఇల్లు నిర్మించుకోండి

ముత్తుకూరు : గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1,80,000 లను ఉపయోగించుకుని లబ్ధిదారులు గృహ నిర్మాణాన్ని నిర్మించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముత్తుకూరు మండలంలోని వల్లూరు పంచాయతీలో జరిగింది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబానికి ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ పథకాలు ఆ ఆ కుటుంబానికి కరపత్రం ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడు లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గడపగడపకు వెళ్ళినప్పుడు వ్యక్తిగత అవసరాలు తప్ప గ్రామాలకు సంబంధించిన అవసరాలను ఎవరు అడగడం లేదని ఆయన తెలిపారు. తాము మౌలిక వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వల్లూరు పశువుల హాస్పిటల్ ఎమ్మెల్యే నిధుల నుండి పది లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అలాగే బ్యాంకుల నుండి 35 వేల రూపాయలను గృహ నిర్మాణాలు లబ్ధిదారునికి అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా టిడిపి నుండి పలువురు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి. సర్పంచ్ పర్ల కొండ ప్రతాప్, ఎంపీపీ గంగవరం సుగుణ, జడ్పిటిసి బందుల వెంకటసుబ్బయ్య, నాయకులు చెంగారెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, విశ్వమోహన్ రెడ్డి, , జనార్దన్ రెడ్డి, సుధాకర్, కోదండరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img