Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంటగలుస్తున్న మానవత్వం

విశాలాంధ్ర ; నాయుడుపేట : నాయుడుపేట పట్టణ పరిధిలో గతనెల 14వ తారీఖున చోటు చేసుకున్న సంఘటన మానవత్వానికి మాయని మచ్చల నిలుస్తుంది. నాయుడుపేట పోలీస్ స్టేషన్ నందు శనివారం స్థానిక సీఐ ప్రభాకర్ రావు, ఎస్ఐ కృష్ణారెడ్డి తోకలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసుల వివరాలు మేరకు, శెట్టిపల్లి ప్రభు చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వ్యక్తి. పుంగనూరు ఎంజీఆర్ వెటర్నరీ కాలేజ్ నందు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ, అక్కడే బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న నాయుడుపేట పిచ్చిరెడ్డి తోపుకు చెందిన ఉషను ఐదుసంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. భార్యాభర్తలుమధ్య తరచూ గొడవలు జరగడంతో ఉష భర్తవద్ద నుంచి వచ్చి నాయుడుపేటలో ఉన్న తమ తల్లిదండ్రులతో కలిసి నివసించసాగింది. మేనకూరు లాయల్ టెక్స్టైల్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంది. ఆపరిశ్రమలో పనిచేస్తున్న సునీల్ కుమార్ తో ఆమెకు పరిచయం ఏర్పడి,ఆపరిచయంకాస్త వారిమధ్య అక్రమసంబంధానికి దారితీసింది. వారమధ్య ఉన్న అక్రమ సంబంధం తెలియని, ప్రభు పుంగనూరు నుంచి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసి నాయుడుపేట నంది వేరుగా కాపురం పెట్టారు. ఉష కంపెనీ నందు పనిచేయడం మానేసి, ఇంటివద్దనే ఉంటూ, తన ప్రియుడు సునీల్ తో తన సంబంధాన్ని యధావిధిగా కొనసాగిస్తుంది. ఉష,సునీల్ తరచు కలుసుకోవడం కుదరకపోవడంతో కలత చెందారు. ఒకరినివిడిచి ఒకరు ఉండలేక, ఉష సునీల్ కలిసి జీవించాలని నిర్ణయించుకొన్నారు. అందుకు ఉష భర్త ప్రభు అడ్డుగాఉన్నాడని, అతని చంపాలని నిర్ణయించుకున్నారు. గతనెల 14వ తారీఖున అర్ధరాత్రి ఒంటిగంటకు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఉష,ఆమెప్రియుడు సునీల్ ప్రభు గొంతుకోసి చంపడానికి ప్రయత్నించారు. కేసుపోలీసు విచారణలోఉండగా నాయుడుపేట సీఐ ప్రభాకర్ రావు, ఎస్సై కృష్ణారెడ్డి తమపోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శివకుమార్, హోంగార్డు వెంకటేశ్వర్లు సహాయంతో తమదైనశైలేలో ముద్దాయిలను విచారించి, 16వ తారీఖున అరెస్టు చేసినారు. కేసును త్వరితగతిన ఛేదించిన సిబ్బందికి గూడూరు డిఎస్పి అవార్డులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img