Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హర్ ఘర్ జల్ గ్రామ పంచాయతీ గా చుండి

విశాలాంధ్ర వలేటివారిపాలెం.హర్ ఘర్ జల్ గ్రామ పంచాయతీ గాచుండి ఎంపికైనట్లు సర్పంచ్ ఇరుపని సతీష్ అన్నారు.శుక్రవారం మండలంలోని చుండిగ్రామ సచివాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో నీటి సరఫరా అందించడం జరుగుతుందని ఆయన అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే ఉద్దేశ్యంతో మహిళలు పిల్లలు ఆరోగ్య భద్రతకోసం జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆర్ డబ్ల్యూ యస్ ఏ ఈ నాయబ్ రసూల్ మాట్లాడుతూ చుండిలో ప్రతి ఇంటికి రక్షిత మంచి త్రాగునీరు యఫ్ హెచ్ టీసీ ద్వారా అందిస్తామని తెలిపారు దీనిలో భాగంగా 50శాతం మహిళలలను భాగస్వామ్యం చేస్తామని తెలిపారు ఈ భాగస్వామ్యంలో 5గురు మహిళలను ఎంపిక చేస్తామని అన్నారు ఆ మహిళలు రోజూ క్రమం తప్పకుండా నీటి నాణ్యతను పరీక్ష చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ఈ పథకం లో ప్రతి ఒక్కరూ బాగస్వామ్యు లై వారి భాగస్వామ్యాన్ని అందించి భవిష్యత్తు సంరక్షణ మరియు నిబద్దత తో సక్రమంగా చేసుకోవాలని ప్రజల కు చూచించారు.ఈ కార్యక్రమంలో యంపిటీసి యానాది కార్యదర్శి అనిల్, ఆదర్శ పాఠశాల చైర్మన్ ఇరుపని వీరవెంకటసత్యనారాయణ, సచివాలయసిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img