Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కృష్ణపట్నంపోర్టు కార్మికులకు మద్దతుగా సిఐటియు ప్రదర్శన

అదా నీ కృష్ణపట్నం పోర్టులో కార్మికుల మెరుపు సమ్మె మద్దతుగా మంగళవారం సిఐటియు ర్యాలీ జరిగింది. అదాని కృష్ణపట్నం పోర్టులో సోమవారం రాత్రి 8 గంటల నుండి వేలాది మంది కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు .జీతాల ఇంక్రిమెంట్లను అతి తక్కువ యేయడంతో కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది .రెండు నెలల నుంచి ఊరించి ఉడికించి కేవలం 500 నుంచి 1000 రూపాయల వరకు ఇంక్రిమెంట్లు వేయడంతో కార్మికులు తీవ్ర ఆందోళనతో సమ్మెకు దిగారు. కార్మికులకు న్యాయమైన ఇంక్రిమెంట్లను వేయాలని ,పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా నెల్లూరు నగరంలోని సిఐటియు కార్యాలయం నుంచి మినీ బైపాస్ మీదుగా పోలే బొమ్మ వరకు సిఐటియు నెల్లూరునగర కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం పూలే బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. సిఐటియు ఇండస్ట్రియల్ కారిడార్ కార్యదర్శి ఎం. మోహన్ రావు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని ,ఎనిమిది గంటల పని విధానం అమలు చేస్తానని ,బోనస్ బకాయిలు చెల్లిస్తానని ,కార్మికులకు చట్ట ప్రకారం ఇంక్రిమెంట్లు వేసి జీతాలు పెంచుతామని కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దగ్గర రాతపూర్వకంగా అంగీకరించి వాటికి తిలోదకాలు ఇచ్చిందని, కార్మిక చట్టాలు అమలు చేయనందున కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, తమ నిరసనలు తెలియజేస్తూ సమ్మెకు దిగారని ,సమ్మెకు ,కార్మికుల ఆందోళనకు సిఐటియు పూర్తి సంఘీభావం ప్రకటిస్తుందని తెలియజేశారు .సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవివి ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన యాజమాన్యం పోలీసులను మోహరించి సమ్మెను ఆణిచేందుకు ప్రయత్నం చేయడం దుర్మార్గమని, పోలీసు నిర్బంధము ద్వారా సమస్య పరిష్కారం కాదని, కార్మికులకు న్యాయమైన ఇంక్రిమెంట్లు వేయాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని తెలియజేశారు. కృష్ణపట్నం పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ లేబర్ డిపార్ట్మెంట్ ,జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నెల్లూరు నగర అధ్యక్ష కార్యదర్శులు జి .నాగేశ్వరరావు, అత్తిమూరి నివాసులు, సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు తుళ్లూరు గోపాల్ ,జి .లక్ష్మీపతి ,ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్కే .రషీద్ ,చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు ,ఆటో కార్మిక సంఘం నగర కార్యదర్శి పెంచలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img