Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కోర్టు స్టే తో ఆగిన నిర్మాణం

విశాలాంధ్ర. కోవూరు, నియోజకవర్గం పరిధిలోని దంపూరు గ్రామంలో ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంగించి సాయి బాబాకు గుడి కి కేటాయించిన స్థలం లో స్థానిక సర్పంచ్ ఆధిపత్య పోరుతో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు కు చట్ట విరుద్దంగా, నిర్మాణపనులు జరుగుతున్న క్రమంలో, వేమూరు రవీంద్ర రెడ్డి హై కోర్టు ను ఆశ్రఇంచి పిదప, ఈ భూమి లో ఎలాంటి నిర్మాణం జరగకూడని స్టే రావడం తో, అధికారులు, సర్పంచ్ చేపడుతున్న నిర్మాణమును, ఆపాలని సూచించారు, దీంతో బాధితుడు, రవీంద్ర రెడ్డి, మంగళవారం విశాలాంధ్ర కు చెప్పారు, తాను తనకు ఉన్న స్థలాన్ని, సాయిబాబా కు ఇచ్చానే తప్ప, ఇలాంటి వారికోసం కాదని అన్నారు, ఉద్దేశ్యం పూర్వ కంగానే, సర్పంచ్, అక్రమంగా నిర్మాణం చేపట్టడం, ప్రజలను రెచ్చ గొట్టే విదంగా ఉందని అన్నారు, పక్కనేవాటర్ ప్లాంటుకు అనువైన స్థలం అందు బాటులో ఉన్నపటికీ, ఇలాంటి చర్యలు పాల్పడడం సరి కాదు అన్నారు,తాను సాయిబాబా దేవాలయం కు తనుకు చెందిన స్థలాన్ని గుడి అభి వృద్ధికి ఇచ్చానని రవీంద్ర రెడ్డి అన్నారు రెండు పర్లంగులు దూరం ఉన్న భూమిని ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చినప్పటికి, సర్పంచ్ పట్టించుకోకుండా, కేవలం తమపై నెపంతోనే, బాబా స్థలం లో నిర్మాణం జరపడం అన్యాయం అని ఆయన అన్నారు, కోర్టు నుండి వచ్చిన స్టే ఆర్డర్ కాపీ ఆధారంగా అధికారులు చర్య లు తీసుకొని ఆపడం పట్ల రవీంద్ర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img