Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నేరుగా నన్ను సంప్రదించండి

– పేదలకు మేలు చేసేలా సీఎం రిలీఫ్‌ ఫండ్‌
– బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండ
– చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
– సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో మేకపాటి

ఉదయగిరి , జూలై 24 : అత్యవసర చికిత్స కోసం వైద్యం చేయించుకున్న వారు సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా తనను కలిస్తే సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు . సోమవారం కొండాపురం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన మంచాల బాలకృష్ణ 27000 రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును తన కార్యాలయం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనకు ఉన్నారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అప్పటి వరకు వైద్యం అందని ద్రాక్షలా ఉంటే ఆరోగ్యశ్రీని తెచ్చి కార్పొరేట్‌ వైద్యాన్ని పేదలకు చేరువ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేస్తూ ఏకంగా 2440 వ్యాధులను చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద కవర్‌ కాని వ్యాధులకు చికిత్స చేయించుకుంటే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక చేయూత ఇస్తున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పేదలు ఎవరున్నా మెడికల్‌ బిల్లులు తీసుకుని వస్తే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img