Monday, October 3, 2022
Monday, October 3, 2022

విశాఖపట్నం లో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి

దామా అంకయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: పెట్టుబడిదారులకు రక్షణ కల్పించాలని లక్ష్యంతోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందని అదే విధంగా రాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి కూడా కేంద్రానికి వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు శనివారం నెల్లూరులోని రామకోటయ్యభవన్ జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మహాసభలు సంబంధించిన గోడ పత్రికలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఈనెల 26 27 28 తేదీలలో సిపిఐ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించారు పోతుందని 26వ తేదీన మహా ప్రదర్శన విశాఖపట్నం నగరంలో ఈ మహాసభలలో సిపిఐ జాతీయ సమితి ప్రధానకార్యదర్శి డి.రాజా పాల్గొంటారని 27 28 తేదీలలో జరిగే ప్రతినిధుల సభలో రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మధు , షాన్ వాజ్, సిరాజ్, నంది పోగుల రమణయ్యజిల్లా సమితి సభ్యులు ఆదినారాయణ కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img