Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కొత్త పింఛన్లు పంపిణీ

విశాలాంధ్ర,వలేటివారిపాలెం. మండలంలోని కళవల్ల గ్రామంలో కొత్తగా మంజూరైన పింఛన్లను శనివారం వైస్ ఎంపీపీ స్వర్ణ మాలకొండయ్య,ఉపసర్పంచ్ జడా అనిల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి పింఛన్లను అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,సచివాలయం సిబ్బంది,వలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img