Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఎస్టీ కాలనీకి తాగునీరు

విశాలాంధ్ర- కందుకూరు: కోవూరు గ్రామంలోని ఎస్టీ కాలనీకు తాగునీరు అందించడం అభినందనీయమని సర్పంచ్ ఆవులు మాధవరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ కాలనీ ప్రజలు తాగునీటి సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్ళటంతో స్పందించిన ఆయన జల జీవన మిషన్ కింద దాదాపుగా 24. లక్షల రూపాయలతో మంచినీటి పైపులైన్ నిర్మాణం చేపట్టి కాలనీ ప్రజల లో అపర భగీరధుడుగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు. ఈ ప్రాంతంలో కటిక ఉప్పునీటి సౌకర్యం ఉండటంతో కాలనీ వాసులు గొంతు తడుపుకోవాలంటే నానా ఇక్కట్లు పడవలసిన పరిస్థితి గతంలో ఉండేదన్నారు. ఈ దుస్థితిని గమనించిన ఎమ్మెల్యే కోవూరు నుండి నాలుగున్నర కిలోమీటర్ల దూరం పైపులైన్ నిర్మాణం చేయించారన్నారు. మంచినీటి సౌకర్యాన్ని అందించడం ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల మాధవరావు, కొండూరి వసంతరావు, ఆర్ డబ్ల్యుయస్ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img