Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయాలి – వామపక్ష విద్యార్థి సంఘాలు

నెల్లూరు నగరంలో బంద్ విజయవంతం

నెల్లూరు నగరంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వి.ఆర్.సి సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం పేరుతో బిజెపి ప్రభుత్వం చేసిన కుట్రకు పూర్తిస్థాయి మద్దతు పలికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం,దీనికి అనుకూలమైన జీవో నెంబర్ 84,85,117,జీవోలు వల్ల నష్టం జరుగుతుంది. గ్రామంలో ఉన్న మూడు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలన్ని కూడా మూసివేయడం మూడు నాలుగు ఐదు తరగతులను విలీనం చేయడం ద్వారా పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు డ్రాపోర్ట్స్ 14 నుంచి 16% పెరిగినది ఇది కేవలం కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుకూలమైన విద్యా విధానం వీటిలో మూడు నాలుగు తరగతుల విలీనం ద్వారా ఎక్కువ శాతం కార్పోరేట్ విద్యాసంస్థల్లో చేరడానికి ప్రమాదం ఉందని ఆయన తెలిపారు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యను ఏ విధంగా విద్యార్థులకు అందజేస్తారు ఏపీపీఎస్సీ ద్వారా విడుదలకు నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేయడం లేదు.అభివృద్ధికి నిధులు లేవు కామన్ పీజీ ఎంట్రెన్స్ కోర్సుల వల్ల యూనివర్సిటీలలో చేరడం లేదు కోర్సులు ఖాళీ అవుతా ఉన్నాయి కోర్సులు ఎత్తివేస్తున్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రైవేటు పీజీ కళాశాల చేరినట్లు అయితే దీని ద్వారా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది తక్షణమే దీన్ని రద్దు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలలో సైన్స్ గ్రూపుల్లో ఉపాధ్యాయ లేక విద్యార్థులు ఫెయిలవుతున్నారు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి రాష్ట్రంలో విద్యార్థులు బస్సు పాసులు పైన అధికంగా వసూలు చేస్తున్నారు బస్సు చార్జీలు తగ్గించాలి కరోనా సమయంలో రాష్ట్రంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు సరిగా ఉపయోగించుకోవడం వల్ల చాలామంది ఫెల్ అవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బై జ్యూస్ తో స్పందన చేసి మరింత మంది విద్యార్థులకు చదువును దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల అవుతున్న ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం లేదు .పీడీఎస్యూ రూరల్ కార్యదర్శి షారుక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు వేలకు వేల ఫీజులు దుస్తులు అక్రమంగా అడ్మిషన్స్ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి వాటిని అడ్డుకట్ట వేయాలని ఆయన తెలిపారు.దాదాపుగా 24 వేలపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేయిస్తున్నారని ఆయన తెలిపారు.
ఏపీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి చైతన్య మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం తీసుకురావడం ఇంకా విద్య వ్యాపారం వైపు వెళ్లే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ హాస్టల్ లో వాటి సమస్యలను పట్టించుకోవడమే లేదు రాష్ట్రంలో దాదాపుగా 450 బీసీ హాస్టల్ వార్డెన్ ఖాళీలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు దూరమయ్యాయి విద్యార్థులు ఆహారం అందించడం లేదు జగనన్న గోరుముద్ద పేరుకు మాత్రమే ఆడు నేడు పథకం కింద పాఠశాలలను మరమ్మత్తులు చేస్తున్నారు తప్ప పూర్తిస్థాయిలో విద్యార్థులకు నాణ్యత మైన విద్యార్థి అందించడంలో విఫలమవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఎపీఎస్యూ, పిడీఎస్యూ, ఏఐడీఎస్వో, పీడీఎస్ఒ, విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img