Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రతి విద్యార్థి మధ్యాహ్న భోజనం తినేలా చూడాలి

జిల్లావిద్యాసాఖాధి కారి

అనుమసముద్రంపేట జూలై 26 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనమ్ తినే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉపాధ్యాయులకు సూచించారు.
ఏ ఎస్ పేట ఉన్నత పాఠశాల కు మంగళవారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు.10వ తరగతి విద్యార్థుల తో మాట్లాడినా రు.అదనపు తరగతులు ఉదయం,సాయంత్రం కనీసం మూడు గంటల పాటు నిర్వహిస్తున్నారని తెలుసుకొని అభినందనలు తెలియజేశారు.ఈ సారి విద్యార్థినీ విద్యార్థులు జిల్లా/రాష్ట్ర స్థా యి లో మార్కులు పొంది తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ఊరు గర్వపడే విధంగా చదవాలని పిల్లల యందు ప్రేరణ కల్గించారు.మధ్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.నాడు నేడు/నాబార్డు అదనపుఎనిమిది తరగతి గదులు పూర్తి అయిన తరువాత ఒక గది ను వంట కొరకు ఏర్పాటు చేయవలసినది గా ఆదేశించారు.పిల్లలు హాజరు శాతం పెంచవలసిన ది గా ఆదేశించారు.100శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేటట్లు పిల్లల్ని ప్రోత్స హించాల్సినదిగా ఆదేశించారు.బాల బాలికల తో వారికి గల సౌకర్యాల గురించి మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు ..బాల బాలికలకు కరాటే పై శిక్షణ ఇప్పిస్తున్నారని , మొక్కలు నాటిన విషయాలు ఆయన దృష్టికి తేవడంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు హెచ్ఎఫ్ అబ్దుల్ హమీద్ ఉపాధ్యాయి నీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img