Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోండి

: తహసీల్దార్

విశాలాంధ్ర వలేటివారిపాలెం.జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు.గురువారం మండలంలోని కొండసముద్రం సచివాలయం ఆవరణలో సర్పంచ్ మన్నం వెంగమ్మ ఆధ్వర్యంలో జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంలో భాగంగా భూములను సర్వే చేయుటకు రైతులతో గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్బంగా తహసీల్దార్ సుందరమ్మ మాట్లాడుతూ రైతులు ఏళ్ల తరబడి భూ సమస్యలతో క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి భూముల రీ సర్వే ప్రారంభించిందని,ఈ రీ సర్వే వలన రైతులకు శాశ్వతముగా భూసమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.అధికారులు గ్రామంలో మీ పొలంను సర్వే చేసేటప్పుడు రైతులు దగ్గర ఉండి తమ పొలంను సర్వే చేయించుకోవాలని అన్నారు రైతులకు ఏమైనా సమస్యలు వచ్చిన తమను సంప్రదించాలని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ విజయభాస్కర్, సర్పంచ్ మన్నం వెంగమ్మ,నాయకులు మన్నం వెంకటరమేష్,నరసింహారావు,రైతులు,విఆర్ఓ,సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img