Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిరుపేద గిరిజనులకు ఆర్ధిక సహాయం

నెల్లూరు జూలై 22:సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు అండదండలు అందించే ఏకైక ప్రభుత్వం  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్  శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పూడిపర్తి, కసుమూరు, సర్వేపల్లి , శ్రీరామ్ పురం గ్రామాలకు చెందిన జగనన్న కాలనీ లబ్ధిదారులైన 162 మంది నిరుపేద గిరిజనులకు 15 వేల రూపాయల వంతున ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమంలో మంత్రి కాకాణి పాల్గొన్నారు. తోలుత వెంకటాచలం జగనన్న కాలనీలో ఆయా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి పనుల పురోగతి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాని సొంతింటి కల నిజం చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.  ప్రతి ఇంటికి ప్రభుత్వం అందించే లక్షా ఎనభై వేల రూపాయలకు తోడు అదనంగా నియోజకవర్గంలోని పేద గిరిజనులకు 15000 అందజేస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ఎస్ ఎన్ జె డిస్టిలరీ వారికి తమ కృతజ్ఞతల న్నారు.  గత ప్రభుత్వాలు కేవలం కాగితాలపైనే ఇల్లు మంజూరు చేసే వారని ఆయా స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలియని అయోమయ స్థితిలో పేదవారు ఉండేవారన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కోట్ల ఖరీదు చేసే భూములను నిరుపేదలకు అందజేసి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, వారి సొంతింటి కలను నిజం చేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని  ప్రతి లే అవుట్ లోని  ప్లాటు ఖరీదు దాదాపు 8 లక్షల పైబడి ఉంటుందన్నారు. ఆ తర్వాత వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు హౌసింగ్ ఏఈ లతో గృహ నిర్మాణం గురించి సమీక్ష నిర్వహించారు.  సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం వుడా పరిధిలో ఉన్నందున త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయుటకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. నిరుపేద గిరిజనులకు ఆర్థిక సహాయం అందించిన ఎస్ ఎన్ జె డిస్టిలరీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కు శాలువా కప్పిసన్మానం చేశారు. గతంలో కూడా ఈ కంపెనీ వారు నియోజకవర్గంలోని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 25 లక్షలు ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేశారు. కంపెనీ చైర్మన్ జయ మురుగన్ దాతృత్వ గుణం కలిగినవారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్ డి ఓ కొండయ్య హౌసింగ్ పిడీ నరసింహులు, ఎంపీడీవో సుస్మిత రెడ్డి, ఎమ్మార్వో నాగరాజు , హౌసింగ్ డీఈ వర ప్రసాదు , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img