Friday, April 19, 2024
Friday, April 19, 2024

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టండి

కమిషనర్ జాహ్నవి

నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ పనులు జరిగేలా అధికారులు, సిబ్బంది దృష్టి సారించాలని కమిషనర్ జాహ్నవి ఆదేశించారు. స్థానిక 18 వ డివిజను హరనాథపురం పరిసర ప్రాంతాల్లోని డ్రైను కాలువల్లో పూడికతీత పనులను కమిషనర్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలపు పరిస్థితుల దృష్ట్యా లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరకుండా డ్రైను కాలువల ద్వారా సాఫీగా ప్రవాహం కొనసాగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని డివిజనుల్లో డ్రైను కాలువల పూడికతీత పనులు జరుగుతున్నాయని, ప్రజలు అవగాహన పెంచుకుని కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు వంటి, ఏలాంటి వ్యర్ధాలు పారవేయొద్దని కమిషనర్ సూచించారు. స్థానిక పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, సచివాలయ సానిటరీ సెక్రటరీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. డివిజనులో పారిశుద్ధ్య నిర్వహణ లోపించి, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img