Friday, April 19, 2024
Friday, April 19, 2024

తెలుగు భాషా పితామహుడు గిడుగు

విశాలాంధ్ర – నెల్లూరు : తెలుగు భాషకు ఎనలేని కృషి చేసిన తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు సేవలు
అమూల్యమైనవని చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత యస్.వి.రమేష్ బాబు పేర్కొన్నారు. యస్.ఆర్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు రూరల్ కొత్తూరు శ్రామిక నగర్ లోని యస్.వి.యస్. స్కూల్ నందు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఘనంగా జరిగింది. ముందుగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. కరెస్పాండెంట్ పి.వి.రెడ్డి మాట్లాడుతూ గిడుగు కృషికి మెచ్చిన నాటి మద్రాసు ప్రభుత్వం 1913లో “రావు బహుదూర్” బిరుదుతో సత్కరించిదని తెలియజేశారు. అనంతరం తెలుగు భాషాకు కృషి చేసిన కవి జంజం కోదండరామయ్య, దొడ్డోజు విజయ నిర్మల లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. మురళీమోహన్ రాజు, ఆర్.ఎమ్.పి. అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎమ్. రోజా రాణి, ఉపాధ్యాయురాలు పి.గౌరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img