Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాట్నాలు తిప్పుతూ చేనేత కార్మికులు ధర్నా

చేనేత ఉప వృత్తుల వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్ సదుపాయం కల్పించాలని, పాత గుర్తింపు కార్డులు యధాతధంగా కొనసాగించాలని నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో జిల్లా కన్వీనర్ బుధవరపు బాలాజీ మాట్లాడుతూ .. జగన్ సర్కార్ నేతన్న నేస్తం ను కొత్త నిబంధనల పేరుతో కోతలు విధిస్తుందన్నారు. పెన్షన్లు రద్దు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మూలంగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. చేనేత రంగంలో ఉపవృత్తులు చేసేవారిని ప్రత్యేకంగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కో – కన్వీనర్‌ ఆశం సురేష్ మాట్లాడుతూ నేతన్న నేస్తం పథకంలో జగన్ సర్కర్ 1035 మగ్గాలు రద్దు చేశారని కరెంటు వాడకం పెరిగాయని ఇంటి విస్తీర్ణం ఎక్కువగా ఉందని రేషన్ కార్డు లేదని 30 సెంట్లు భూమి ఉందని కారణాలు చెబుతూ నేతన్న నేస్తన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదనన్నారు . ఈ కార్యక్రమంలో రామనాథం రాజశేఖర్ చింత గింజల సుబ్రమణ్యం కాసా శ్రీనివాసులు తాళ్ల నరసింహ స్వామి ధనుంజయ గోలి సురేంద్ర ఉకోటి లక్ష్మీనారాయణ పద్మశాలి జిల్లా సంఘం అధ్యక్షుడు జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు . చేనేతల ధర్నాకు బిజెపి నేత మిడతల రమేష్ బీసీ జెఎసి నాయకులు జనార్ధన్ రాజులు సంఘీభావం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img