Monday, October 3, 2022
Monday, October 3, 2022

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

విశాలాంధ్ర – ఉలవపాడు : ఈరోజు జి.వి.ఎస్.ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉలవపాడు నందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. లక్ష్మీ సుధారాణి గారి అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలను తెలిపి గిడుగు రామ్మూర్తి పంతులు గారి బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం గురించి వివరించారు. తెలుగు అధ్యాపకుడు వై. సుధాకర బాబు మాట్లాడుతూ వ్యావహారిక భాషా ఉద్యమం గురించి వివరించారు. మాట్లాడే భాషకు, వ్రాసే భాషకు మధ్య గల అంతరాలను తొలగించడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసిన పోరాటాన్ని, వారు చేసిన భాషాసేవ గురించి వివరించారు. వారి స్ఫూర్తితో మనమంతా తెలుగు భాషాభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img