Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రధానమంత్రి జీవన్ యోజన లక్ష్యం నెరవేరిందా?

పార్లమెంట్లో అడిగిన ఎంపీ ఆదాల

ప్రధానమంత్రి జీవన్ యోజన పథకం ఎందుకు ప్రారంభించారని దాని లక్ష్యం నెరవేరిందా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంట్లో అడిగారు. ఆంధ్రప్రదేశ్లో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని కూడా అడిగారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ తెలి రాతపూర్వకంగా సమాధానమిస్తూ 2019లో సమీకృత బయో ఇధనాల్ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకు గాను 1969 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి జీవన్ యోజన పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు అభివృద్ధి, పరిశోధనలను ప్రోత్సహించి వాణిజ్యపరంగా లాభసాటిగా మార్చేందుకు కృషి జరిగిందని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఒడిస్సా, అస్సాం రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులకు నిధులను కేటాయించారని, ఈ ఏడాది కొన్ని పూర్తి కానున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటు ఆలోచనేదీ లేదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img