Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

తల్లి – బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ దూరం

ముత్తుకూరు : తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల రొమ్ముక్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని ఐసిడిఎస్ సూపర్వైజర్ లలితాంబ తెలిపారు. తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం సోమవారం మండలంలోని బ్రహ్మదేవుని ఎస్టీ కాలనీ అంగన్వాడి కేంద్రాల జరిగింది. ఈ సందర్భంగా ఆమె తల్లులతోమాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలను తాగించాలని అందువల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అలాగే కచ్చితంగా తల్లి ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో బిడ్డకి ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత కుమారి. అంగన్వాడీ వర్కర్లు హరి కుమారి, రాజేశ్వరి, సుమలత, హెల్పర్ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img