Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రీ సర్వే పై అభ్యంతరాలు ఉంటే తెలపండి

అనుమ సముద్రంపేట : జగనన్న భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జరిగిన రిసర్వేపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రైతులు తెలియజేయాలని ఏఎస్పేట డిప్యూటీ తాసిల్దార్ జి రవికుమార్ రైతులకు సూచించారు.మండలంలోని
కూనలమ్మ పాడు , హసనాపురం గ్రామములలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా పథకంలో రీ సర్వే లో భాగంగా నమోదు చేసిన సర్వే రికార్డులపై భూ యజమానులు వారి వారి భూముల గురించి అభ్యంతరాలు తెలియజేసేందుకు మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వారి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం సర్వే అనంతరం నమోదు చేసిన విస్తీర్ణాలను సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఎల్ పి ఎం ప్రకారం ఎంత విస్తీర్ణం వచ్చిందని నిర్ధారింపబడిన ఆర్ ఓ ఆర్ డ్రాఫ్ట్ రిజిస్టర్ తుది దశకు వచ్చినది క నుక ఆ వివరాలను గ్రామసభ ద్వారా ఆ భూముల యజమానులకు చదివి వినిపించా రు. ఆర్ ఓ ఆర్ డ్రాఫ్ట్ రిజిస్టర్ ఏవైనా అభ్యంతరములు ఉన్న యెడల ఈ గ్రామ సభలో తెలుపుకొనవచ్చునని ప్రజలకు తెలియజేయడమైనది. ఆ అభ్యంతరాలను పై అధికారుల ఆదేశాల మేరకు తిరిగి పరిశీలించి ఆర్ ఓ ఆర్ డ్రాఫ్ట్ రిజిస్టర్ నందు నమోదు చేయబడునని తెలియజేశా రు. ఈ కార్యక్రమములో అక్బరాబాదు గ్రామ సర్పంచ్ గూడపురెడ్డి వెంకట్ రెడ్డి , హసనాపురం గ్రామ సర్పంచ్ . వెంకట కృష్ణయ్య అధ్యక్షత వహించారు. మండల డిప్యూటీ తాసిల్దార్ జి రవికుమార్ , ఆర్ ఐ సిహెచ్ శ్యామ్ కుమార్ , మండల డిప్యూటీ సర్వేయర్ రాజా , వీఆర్వో లు హజరత్త య్యా, మనోహర్ ,పిఎస్ లు ఎస్ ప్రతాప్, పరదేశయ్య, వి ఎస్ శ్రీ నవీన్ , నా హిద్ , గ్రామ పెద్దలు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img