Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

జర్నలిస్టులను సైతం హౌస్ అరెస్టులు చేయడం అమానుషం…

ఎలక్ట్రానిక్ మీడియా నెల్లూరు జిల్లా కమిటీ..
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు : ఇటీవల 40 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రిని కలుస్తారన్న ఉద్దేశంతో జర్నలిస్టులను సైతం హౌస్ అరెస్ట్ చేయడాన్ని.తెల్లవారుజామునే వెంకటగిరి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు దోసకాయల రామ్మోహన్ నుపోలీసులు గృహనిర్బంధం చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే నెల్లూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు తమ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలు లేకుండా పోలీసులు గృహనిర్బంధాలు.. ముందస్తు చర్యల పేరుతో ఇక్కట్లకు గురి చేయడం మంచి పద్ధతి కాదని.. ఇలా అణిచివేత ధోరణికి పాల్పడుతున్న పోలీసుల చర్యలను ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా నెల్లూరు జిల్లా శాఖ తరఫున ఖండిస్తూ.. మరో మారు ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమైతే.. తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టేందుకు కూడా వెనకాడబోమని ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షులు రమేష్ బాబు హెచ్చరిస్తున్నాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img