Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

సత్వర సేవలందించేందుకే జగనన్న సురక్ష. సర్పంచ్ వెంగమ్మ

విశాలాంధ్ర -వలేటివారిపాలెం ప్రజలకు సత్వర సేవలందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొండసముద్రం సర్పంచ్ మన్నం వెంగమ్మ రమేష్ అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం గురువారం మండలంలోని కొండసముద్రం గ్రామంలో ఎంపిడిఓ రఫిక్ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ వెంగమ్మ మాట్లాడుతూ ప్రజాసమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేవిదంగా అక్కడే జగనన్న సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి పరిష్కారం చూపుతూ వారికి అదేరోజు సర్టిఫికెట్ లను మంజూరు చేసి ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు ఈ సందర్బంగా కొండసముద్రం సచివాలయం పరిధిలోని ప్రజలందరి తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మరియు మన శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి కి ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంతటి పారదర్శక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి కి మీరంతా నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శోబిక,జెడ్పిటీసీ ఇంటూరి భారతి,ఎంపీపీ పొనుగోటి మౌనిక,పోలినేనిపాలెం ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర,కో-ఆప్షన్ సభ్యులు,వైసీపీ నాయకులు మన్నం వెంకటరమేష్, మండలమీడియా అధికారప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండలజేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు, ఉపసర్పంచ్ నరసింహం,ఆర్ ఐ నర్సయ్య సచివాలయం సిబ్బంది,గృహసారధులు, వలంటీర్లు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img