Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

ఫోన్ కాల్ కు తక్షణం స్పందించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సౌత్ మోపూరులో వైద్య శిబిరం ఏర్పాటు

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూర్ గ్రామంలో పలువురు జ్వరాల బారిన పడుతున్నారని స్థానిక గ్రామస్తులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, , వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకువచ్చారు. దీంతో వారు వెంటనే స్పందించి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడారు. సౌత్ మోపూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పలువురు స్థానికులు ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఫోన్ చేయగానే వెంటనే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కోటంరెడ్డి సోదరులకు స్థానిక గ్రామస్తులు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img