Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

పనిచేయనివారు సెలవు పెట్టి వెళ్లిపోండి

ఉద్యోగులు, సిబ్బందిపై నగరపాలక సంస్థ కమిషనర్ ఆగ్రహం

విశాలాంధ్ర, నెల్లూరు (కార్పొరేషన్) : నా ఆలోచనలకు అనుగుణంగా పనిచేయండి.. పనిలో వేగం ఉండాలి.. పనిచేయలేనివారు సెలవు పెట్టి వెళ్లిపోండి అని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్పందన కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ సిబ్బంది ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని చేయకుండా కాలయాపన చేస్తూ కాలక్షేపం చేస్తున్న ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. కార్పొరేషన్ లో వివిధ విభాగాల అధికారులకు జడత్వం ఆవహించింది. తమ వద్ద ఫైళ్ళు పేర పెట్టుకుని ఉండడం, కమిషనర్ అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నా ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. కొంతమంది అధికారులు పనిలో వేగం చూపడం లేదని అలాంటివారు పని చేయలేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని హెచ్చరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంతమంది ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్లు వివరాలు అందజేయాలని గత మూడు రోజులుగా చెబుతున్న కూడా ఎవరు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో వేగం పెంచకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img